Skip to product information
Jajimalli
Rs. 60.00
పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో! పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోరున తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. 'అమ్మా! రుయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.