Skip to product information
Nallamala Vaalimama Prapancham 3

Nallamala Vaalimama Prapancham 3

Rs. 650.00

'వాలిమామ కథలు' ఎందుకు ప్రత్యేకం?

వాలిమామ కథలు మొత్తం సిరీస్ రాయడానికి నేను తీసుకున్న సుమారు ఎనిమిదిన్నరేళ్ల సమయంలో ఎక్కువ భాగం ... చెంచు సోదరుల జీవితాలు, వాటిలోని వైవిధ్యాలు; వైరుధ్యాలు, జీవనోపాధి మార్గాలు, ఇంకా పలు అంశాల మీదనే దృష్టిపెట్టాను. మరోవైపు వారి భాష, పలుకులు, పలుకుబడులు, వాటిని పలికే తీర్లు, సరిహద్దు యాసల గురించి విడిగా అధ్యయనం చేశాను. బహుశా 1990కి ముందే నేనీ ప్రాజెక్టును మొదలు పెట్టి వున్నట్లయితే సమాచారం లభించే అవకాశం దక్కేది. అప్పటికి నల్లమలలో ఇంకా కొందరైనా నిఖార్సయిన చెంచులు మిగిలివున్నారు. అడవి జీవితాన్ని ప్రతిబింబించేలా వాలిమామ కథల్ని ఇంకాస్త బలంగా రాసే వీలయ్యేది. కానీ, అప్పటికి నేనింకా విద్యార్థి దశలోనే వుండడం వల్ల ఇది సాధ్యపడలేదు. అయితేనేం, వయసు 40 ఏళ్లు దాటాక మళ్లీ మొదలుపెట్టిన ఈ సరికొత్త అధ్యయనం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఫలితంగానే ఈ 117 కథల సిరీస్ ను సాధ్యమైనంత సహజంగా, ఫలవంతంగా పూర్తిచేయగలిగానని భావిస్తున్నాను.

అడవిలో బతుకుతెరువు భారం కావడం వంటి సమస్యల వల్ల పట్టణీకరణ పెరిగింది. పట్టణాలు, నగరాలకు వలసపోయే సాధారణ ప్రజల్లాగే గిరిజనుల వలస కూడా మొదలైంది. ఈ శాతం పెరుగుతూ వస్తున్నప్పటికీ, నిజానికి ఈరోజుకీ అడవిలోనే వుంటూ, తమ బతుకుతెరువును సాధించుకుంటున్న గిరిజనుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఘోరారణ్యాల మధ్య మృగాలతో సహవాసం చేస్తున్నవారి సంఖ్య కూడా పెద్దదే. నా ప్రయాణంలో కొందరు మిత్రుల అండదండలతో నేను నల్లమల లోని చాలా ప్రాంతాలు సందర్శించాను. దిట్టమైన లోతు, మృగాలు తిరుగాడే ఫారెస్ట్ జోన్లలో కూడా సఫారీలు, సొంత కార్లలో ప్రయాణం చేశాను. ఇప్పుడైతే మొత్తం అడవినీ అభయారణ్యంగా ప్రకటించారు. చెంచులు కూడా చాలామంది గ్రామాలకు వలసపోతున్నారు.

You may also like