"నాన్న వచ్చిన వేళా విశేషం" -
ఈ పుస్తకం ప్రచురణకు ముందే డ్రాఫ్ట్ వెర్షన్ చదివే అవకాశం దక్కినవారిలో నేనూ ఒకదాన్ని.
రవి రైటింగ్ స్టైల్ నాకు ముందే తన కథల పుస్తకం "కృష్ణా నగర్ వీధుల్లో" ద్వారా పరిచయం.
చాలా Raw emotions ను క్యాప్చర్ చేస్తాడు తను.
ఏ పుస్తకం చదివినా,
అది కళ్లముందే జరుగుతున్నట్టే ఊహించుకుంటాను నేను.
"నాన్న వచ్చిన వేళా విశేషం" - నవలలో అది ఊహ కాదు.,
అనుభూతి.
మొదట టైటిల్ చూసి
ఇది కేవలం తండ్రి–కొడుకుల కథే అనుకున్నాను.
కానీ ఇదొక మంచి ప్రేమ కథ ...
కేవలం తండ్రి కొడుకుల మధ్య ప్రేమే కాదు,
ప్రేమికుల మధ్య,
స్నేహితుల మధ్య,
బాల్యపు జ్ఞాపకాల మధ్య,
మాటలకంటే ముందే మాట్లాడే మౌనాల మధ్య.
ఒక్క ప్రేమేనా?
కోపం, భయం, బాధ.... అన్నీ భావోద్వేగాలను రవి ఈ పుస్తకంలో పండించాడు.
ప్రతి పాత్రకి రవి సరైన బరువు ఇచ్చాడు.
ఎవరు ఎక్కడ మొదలవ్వాలి?
ఎక్కడ ఆగాలి?
కథను ఎక్కడ మలుపు తిప్పాలి?
అన్నీ చాలా స్పష్టంగా అనిపిస్తాయి.
ఈ పుస్తకం చదివినప్పటినుండి రివ్యూ ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని ఆలోచించాను
పొయిటిక్ గా లేదా డ్రమాటిక్ గా చెప్పాలి అనుకోవట్లేదు.
I just wanted to make it simple.
ఈ పుస్తకం చదివి, మీరు ఏ character or ఏ situation కి ఎక్కువ connect అయ్యారో చూడండి.
New readers ki matram chadhavalanna interest raadheno ani naa abhiprayam. . Nanna entry ichina tharvatha nundi pages twaraga chadhivesaanu. Katha interest ga undhi . Kaani mundhu chapters chadhuvthunte . Book chadhavaali anna interest pothundhi ..