Skip to product information
మృత్యు శీతల స్పర్శ లాంటి ఏకాంతంలోనో, ఒంటరిగా ఆలోచనల బిడారుతో సాగిపోతున్న కాలంలోనో ఓ ప్రేమను తలచుకుంటాం. మన్ను మీన వాన కురిసినట్టు, గాలిలో ప్రేమ పరిమళం ముక్కుపుటలను తాకి పురా జ్ఞాపకాలను మోసుకొచ్చినట్లు, రెండు అరచేతులు రుద్దుకుని చెంపల మీద ఆన్చుకుంటే వచ్చే వెచ్చదనం, అలాంటి స్మ్రుతినేదో మొసుకోచ్చి మరులు గొలిపినట్లు ప్రేమను తలచుకుంటాం. ప్రేమ అన్నిసార్లూ మనిషే అవ్వక్కర్లేదు. ఆ మనిషి తాలుకు జ్ఞాపకాలే అవ్వక్కర్లేదు. ప్రేమ అనే ఊహ చాలు. ప్రేమ ఇలా ఉండాలనో, ఇలా కూడా ఉంటుందనో మన మస్తిష్కంలో చేసుకునే ఊహ చాలు. ఆ ఊహే రేపటికి ఆశ్వాసం. బతుకును నడిపించే ఇంధనం. ఈ పచ్చి మైదాకు వాసన ఆ పని చేస్తుంది.