Skip to product information
RUN - A THRILLER NOVEL
“రన్” అనే ఈ నవల, చిత్ర దర్శకుడైన అమర్ తన జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ కథలో బెట్టింగ్ యాప్ల వెనుక ఉన్న నేరపూరిత కార్యకలాపాలు, రాజకీయ కుట్రలు, మీడియా మానిప్యులేషన్ వంటి సమకాలీన అంశాలు చర్చించబడ్డాయి. ప్రస్తుతం మన చుట్టూ బెట్టింగ్ యాప్లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్నాం - యువత ఆర్థిక నష్టాలు, ఆత్మహత్యలు, కుటుంబాల విచ్ఛిన్నం. ఈ నవల ఇలాంటి సమస్యలను నేర్పుగా చిత్రిస్తుంది. ఈ నవల ఒక మర్డర్ మిస్టరీ, పొలిటికల్ థ్రిల్లర్, సైకలాజికల్ డ్రామా అనే మూడు అంశాలను సమర్థవంతంగా మిళితం చేస్తుంది. ఆరు అధ్యాయాలుగా విస్తరించిన ఈ కథనం, లీనియర్గా కాకుండా, కాలాన్ని ముందుకీ వెనక్కీ తిప్పుతూ, పాఠకుల ఉత్కంఠను నిలుపుతుంది.