Skip to product information
Screenplay Master SUKUMAR
1/2

Screenplay Master SUKUMAR

Rs. 225.00
ఈ గ్రంథం పదహారు అధ్యాయాలతో ముందొక స్క్రీన్ప్లే నిఘంటువునూ, చివర ఒక అనుబంధంతోనూ ఒక సమగ్ర విశ్లేషణా గ్రంథంగా రూపొందింది. అయితే దీన్ని ప్రశంసా పత్రంగానో లేక అభిమాన వ్యాఖ్యానంగానో గాక ఒక పరిశోధకుడిగా మాస్టర్ సుకుమార్ తన స్క్రీన్లలో చేసిన అద్భుతాల లోతుల్లోకి దిగి విశ్లేషించటమే ప్రధాన లక్ష్యమని డా. ప్రవీణ్ యజ్ఞల ప్రకటిస్తాడు. * ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఈ పుస్తకం ఒక దర్శకుడిని ఆకాశానికి ఎత్తేయడానికి రాసింది కాదు. ఒక అద్భుతమైన సృజనాత్మక ప్రయాణాన్ని పోస్టుమార్టం చేసే ఒక శస్త్రచికిత్స. ఒక ఐడియా ఎలా పుడుతుంది, దాన్ని కాగితం మీద ఎలా పెడతారు, అది తెరమీదకి వచ్చేసరికి ఎన్ని రూపాలు మారుతుంది, ప్రేక్షకుడు దానికి ఎలా కనెక్ట్ అవుతాడు అనే విషయాలను ఉదాహరణలతో, థియరీలతో సహా ఇందులో చర్చించడం జరిగింది. * వెంకట్ శిద్దారెడ్డి తెరపై కనిపించే కథ వెనుక, పాత్రల మనస్తత్వం, సంఘర్షణ, సమాచార నియంత్రణ, దృశ్య నిర్మాణం, కారణఫలిత సంబంధం, భావోద్వేగాల వంటి అనేక అంతర్లీన అంశాలు పనిచేస్తుంటాయి. ఆ అదృశ్య నిర్మాణాన్ని వెలికి తీసి, సుకుమార్ సినిమాలను ఒక స్క్రీన్ప్లే అధ్యయనంగా మన ముందుంచిన ప్రయత్నమే ప్రవీణ్ యజ్ఞల రచించిన “స్క్రీన్ ప్లే మాస్టర్ సుకుమార్". * డాక్టర్. జె. డి. ప్రభాకర్ చదువుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. సుకుమార్ గారిని దగ్గరగా చూస్తూ, స్టోరీ డిస్కషన్ లో ప్రత్యక్షంగా పాల్గొంటూ మేము నేర్చుకుంటున్న సూక్ష్మ విషయాలు రచయిత భలే పట్టుకున్నాడని ఆశ్చర్యం కలిగింది. ఆయన సినిమాలు ఎంతగానో పరిశీలించి, లోతుగా పరిశోధిస్తే తప్ప ఈ సంగతులన్నీ పట్టుకోవడం అసాధ్యం. ఆ అసాధ్యాన్ని తన కలంతో సుసాధ్యం చేశాడు రచయిత. * కమల్ రెడ్డి మంజర్లపాటి

More books from Anvikshiki Publications

You may also like