Skip to product information
అందమైన జీవితం రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనల్లో మరో అద్భుతమైన రచన 'అందమైన జీవితం'. ఏదో బతుకుంటున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్లు గా కాకుండా జీవితాన్ని అందం గా, ఆనందం గా ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం. మనం అందరం ఏవో పనుల్లో ప్రతి రోజు బిజీగా గడుపుతుంటాం. మనకంటూ ఒక లైఫ్ స్టైల్ ని అలవర్చుకుని ఉంటాము. కానీ దానితో ఎంత వరకు ఆనందంగా ఉన్నాం అనేది మనకి మనమే అనుకోవాలి. 1989 ని కథా కాలం గా చేసుకొని మల్లాది గారు ఈ పుస్తకం లో శాంతి, ప్రియతమ్ కు మధ్య జరిగే సన్నివేశాలని కళ్ళకి కట్టినట్టు రచించారు. ఒకరి తో ఒకరు మాట్లాడుకుంటూ, కొత్త విషయాలు తెలుసుకుంటే, అరే, మనమెందుకు ఇలా జీవించకూడదు అనేలా ఆలోచింపజేసే పుస్తకం ఇది. కథ మొత్తానికి గల ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు.