ఈ పుస్తకం నాదా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటుంటాను. సమాధానం కాదు అనే చెప్పుకుంటుంటాను. అవును ! ఒక రచన అనేది అది రాసిన కలానిదా లేక ఆ కలాన్ని కదిలించిన హస్తానిదా అంటే ఖచ్చితంగా ఆ హస్తానిదే ఆ రచన ఇక్కడ ఈ కవనమాలి ఓ కలం. ఈ కలాన్ని కదిలించిన హస్తాలు ఎందరో స్త్రీ మూర్తులు. అందుకే ఇవి వారి మాటలు, వారి జీవితాలకు ప్రతిబింబాలు. వారికి ప్రపంచానికి మధ్య నేనో మాధ్యమాన్ని మాత్రమే. - కవనమాలి