ఈ 'డెవిల్స్ మైండ్' నవలను శ్రద్ధగా రాశాడు. రాశాక నాకు చూపించాడు. నవలను చదవడం మొదలు పెడితే చివరిదాకా వదలకుండా చదివిస్తుంది. ఏ రచనైనా అది ప్రాథమిక లక్షణంగా ఉండాలి. చివరివరకు సస్పెన్స్ ని పోషించాడు. ఆ రకంగా విజయం సాధించాడు. -పి. చంద్రశేఖర అజాద్ (కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత) సరికొత్త స్టోరీ లైన్ తో, కథ మొదలు నుంచి చివరి దాకా థ్రిల్లర్ ఎలిమెంట్ ఎక్కడా తగ్గకుండా, అలజడి క్రియేట్ చేస్తుంది. ఈ ' డెవిల్స్ మైండ్ ' నవల ఒక యునిక్ ప్లాట్ పాయింట్ & రియలిస్టిక్ నెరేషన్ తో - తప్పకుండా అందరికీ నచ్చుతుంది. -స్వప్న పెరి (BooksViewsCafe, Book Reviewer) హార్రర్ నుంచి మొదలై థ్రిల్లర్లా మారి మధ్యలో కాసింత నవ్వులు పూయిస్తూ చివర్లో మెదడుకి పని పెడుతుంది ఈ నవల. జేమ్స్, పరుశురాంలు పట్టు వదలని విక్రమార్కులు. ఒక్కో ప్రశ్న.. ఎన్నో సమాధానాలు. Devils Mind - A page turner indeed! - విజయ శేఖర్ ఉపాధ్యాయుల (రచయిత)