ప్రేమ ఎంత అందమైనదో, అంతే అంతుచిక్కనిది. కొందరు ఈ ప్రేమకై పుడతారు... కొందరు ఈ ప్రేమకై జీవిస్తారు... ఎందరో ఈ ప్రేమను పొందలేక, వదలలేక, కదలని శిలలా నిశిలో కలిసిపోయారు. జన్మంతా కలవలేక, కనుల లేకతో సరిపెట్టుకున్నవాళ్లు ఎంతో మంది. అంత చిక్కైన ప్రేమలోనూ ఏదో ఒక రోజు పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దేవతలు సైతం సులువుగా పొందలేక, జన్మలెత్తి రావాల్సి వచ్చింది - ఈ ప్రేమ కోసమే!