ఈ మనసు నేసిన కథలు..అక్షరాలా నా మనసు నేసిన కథలు. అక్షరాలలో నే దాచుకున్న నా బాల్యపు గురుతులు.నేను చూసిన మనుషులు, నన్ను కదిలించిన మనస్తత్వాలు, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలు... ఇవే ఈ పుస్తకానికి పునాదులు. నాగర్ కర్నూల్ అనే మా ఊరిలో సంతబజారు అని నే పెరిగిన ఆ వీధిలోని మనుషుల జీవితాలకి కాసింత కల్పన జతచేసి కాగితంపై చెక్కిన కథాశిల్పం ఈ పుస్తకం. నిజానికి ఇందులోని ప్రతీ కథ ఒక సగటు మనిషి జీవితానికి అద్దం పడుతుంది. రండి. నా పదాలని చదవండి. ఆ పాత్రలలో జీవించండి... ఏదో ఒక కథలో ఎక్కడో ఒక సంఘటనలో మీకు మీరు తప్పక తారసపడతారని మనసారా నమ్ముతున్నాను.